మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..! | huge assembly set for Mahesh babu bharath ane nenu | Sakshi
Sakshi News home page

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

Aug 28 2017 12:10 PM | Updated on May 10 2018 12:13 PM

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..! - Sakshi

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

ప్రస్తుతం రుమేనియాలో సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.

ప్రస్తుతం రుమేనియాలో సాంగ్ షూట్ లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ షూటింగ్ పూర్తి అయిన తరువాత అసెంబ్లీలో అడుగుపెట్టనున్నాడు. స్పైడర్ సినిమా పనులను దాదాపుగా పూర్తి చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది.

ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో 2 కోట్లతో భారీ అసెంబ్లీ సెట్ ను రెడీ చేశారు. స్పైడర్ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన వెంటనే మహేష్ అసెంబ్లీ సెట్ లో జరిగే షూటింగ్ లో పాల్గొననున్నాడు. మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్, కొరటాల కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఘనవిజయం సాధించటంతో భరత్ అనే నేను పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Advertisement
 
Advertisement
Advertisement