వజ్రాలతో వినోదం! | Horror Comedy as vajralu kavala nayana | Sakshi
Sakshi News home page

వజ్రాలతో వినోదం!

Apr 11 2016 10:41 PM | Updated on Sep 3 2017 9:42 PM

వజ్రాలతో వినోదం!

వజ్రాలతో వినోదం!

అనిల్, నేహ, నిఖిత జంటగా పి.రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీపాద ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై...

అనిల్, నేహ, నిఖిత జంటగా పి.రాధాకృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ శ్రీపాద ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిశోర్ కుమార్ కోట నిర్మిస్తున్న నూతన చిత్రం ‘వజ్రాలు కావాలా నాయనా’. షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఇటీవల సంచలనం సృష్టించిన ఓ అంశాన్ని కథగా తీసుకుని, దానికి సస్పెన్స్, లవ్, థ్రిల్లింగ్ అంశాలు జోడించి హారర్ కామెడీగా తెరకెక్కిస్తున్నాం. ఇందులో వినోదానికి పెద్దపీట వేశాం’’ అని తెలిపారు.

‘‘సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసి, జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. హీరో, హీరోయిన్లు, నటులు అమర్, విజయ్‌సాయి, శివకుమార్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమేరా: అమర్, సంగీతం: జాన్, విజయ్ కురాకుల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement