ఆయనతో​ నటించడం మంచి అనుభవం: నటి | Heroin Amala paul acts in Bhaskar oru Rascal movie | Sakshi
Sakshi News home page

ఆయనతో ​నటించడం మంచి అనుభవం: నటి

Nov 18 2017 9:41 PM | Updated on Nov 18 2017 9:46 PM

Heroin Amala paul acts in Bhaskar oru Rascal movie - Sakshi

ఆయనతో చాలా విషయాలను పంచుకుంటానని అంటోంది సంచలన నటి అమలాపాల్‌. హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలోనే దర్శకుడు విజయ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుందీ ఈ మాలయాళీ భామ. రెండేళ్లు కాకముందే భర్తకు విడాకులు ఇచ్చి నటన బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హీరోయిన్‌గా బిజీగా ఉన్న అమలాపాల్‌ హీరో అరవిందస్వామికి జంటగా నటించిన భాస్కర్‌ ఓరు రాస్కెల్‌ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని పంచుకుంటూ..  ఇందులో తాను కారైక్కుడి యువతిగా నటించానని చెప్పింది.

ముక్కపుడక, లంగా వోణి అంటూ పాత గెటప్‌ కొత్తగా ఉంటుందని తెలిపింది. ఇందులో ఒక పిల్లకు తల్లిగా నటించానని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ  చూసి ఆనందించే విధంగా దర్శకుడు సిద్ధిక్‌ తీశారని చెప్పారు. నటుడు అరవిందస్వామితో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. ఈ చిత్రం ద్వారా తనకూ లభించిన మంచి స్నేహితుడు ఆయన.. చాలా విషయాలు ఆయనతో పంచుకుంటున్నానని అమలాపాల్‌ చెప్పారు.

తన జీవితంలో ఇది మంచి టైమ్‌గా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఇటీవల స్త్రీ ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకాదరణ లభించడం మంచి పరిణామంగా పేర్కొంది. నయనతార నటించిన అరమ్‌ చిత్రం అందిర ప్రశంసలను పొందుతోందనీ, అలాంటి సామాజిక అంశాలతో కూడిన అదో అంద పరవై అనే చిత్రంలో తానూ నటిస్తున్నానిని ఈ మళయాళీ బ్యూటీ తెలిపారు. తన అందాన్ని కాపోడుకోవడానికి యోగా, ఎక్సర్‌సైజ్‌లు నిత్యం చేస్తున్నారని, తన సంతోషానికి ప్రధాన కారణం యోగానేనని అమలాపాల్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement