
‘ఇకనుంచి నో గ్యాప్. కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తా’’ అని ఆ మధ్య ప్రభాస్ తన అభిమానులకు ప్రామిస్ చేసిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకి గుమ్మడికాయ కొట్టగానే ప్రభాస్ కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల టాక్.
‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరం ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందట. ఫిబ్రవరికల్లా ‘సాహో’ పూర్తవుతుందట. అంతా ఓకే.. ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నారని ఓ వార్త హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని ‘సాక్షి’తో ప్రభాస్ సన్నిహితులు పేర్కొన్నారు. సో.. పెళ్లి వార్త ఉత్తుత్తిదే.