రెండోసారి 'హలో బ్రదర్' రీమేక్ | hello brother once again in bollywood | Sakshi
Sakshi News home page

రెండోసారి 'హలో బ్రదర్' రీమేక్

Mar 16 2016 8:15 PM | Updated on Jul 15 2019 9:21 PM

ఇటీవల కాలంలో సౌత్ సినిమాలో బాలీవుడ్లో వరుసగా రీమేక్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలందరూ సక్సెస్ ట్రాక్లోకి రావడానికి సౌత్ కథల మీదే ఆధారపడుతున్నారు. అదే బాటలో యంగ్ హీరో వరుణ్...

ఇటీవల కాలంలో సౌత్ సినిమాలో బాలీవుడ్లో వరుసగా రీమేక్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోలందరూ సక్సెస్ ట్రాక్లోకి రావడానికి సౌత్ కథల మీదే ఆధారపడుతున్నారు. అదే బాటలో యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఓ సౌత్ సినిమా మీద దృష్టి పెట్టాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్లో ఒకసారి రీమేక్ అయిన సినిమా కావటం మరో విశేషం. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన హలో బ్రదర్ సినిమాను వరుణ్ ధావన్ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

1994లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన హలో బ్రదర్ సినిమాను జుడ్వా పేరుతో సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా హలో బ్రదర్ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. జుడ్వా సినిమాకు దర్శకత్వం వహించిన డేవిడ్ ధావన్ మరోసారి తన కొడుకు హీరోగా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

తెలుగులోనూ ఈ సినిమా రీమేక్పై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో నాగచైతన్య హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో హలో బ్రదర్ సినిమాను రీమేక్ చేస్తారంటూ భారీ ప్రచారం జరిగింది. అయితే చివరి నిమిషంలో ఆగిపోయింది. మరి బాలీవుడ్ రీమేక్ తరువాత అయినా తెలుగులో హలో బ్రదర్ను రీమేక్ చేస్తారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement