జీఎస్‌టీ బ్లాక్‌ బస్టర్‌‌.. కాలేజ్‌ గర్ల్స్‌కు థ్యాంక్స్‌ : వర్మ | GST block buster.. thanks to college girls : Ramgopalvarma | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ బ్లాక్‌ బస్టర్‌‌.. కాలేజ్‌ గర్ల్స్‌కు థ్యాంక్స్‌ : వర్మ

Jan 27 2018 7:39 PM | Updated on Jan 27 2018 7:41 PM

GST block buster.. thanks to college girls : Ramgopalvarma - Sakshi

సాక్షి, ముంబయి : సంచలనాల కేంద్ర బిందువు, వివాదాస్పద అంశాలతో స్నేహం చేసే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తాజాగా విడుదల చేసిన 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' (జీఎస్టీ)ని బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిందట. ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ ఫాంపై జీఎస్‌టీ దుమ్ము రేపుతున్నట్లు రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పారు‌. జీఎస్‌టీ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందిస్తున్న రామ్‌ తాజాగా ట్విటర్‌ స్పందించారు.

అందులో జీఎస్‌టీ బ్లాక్‌ బస్టర్‌ అయిందని చెప్పారు. ముఖ్యంగా జీఎస్‌టీ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మద్దతు ఇస్తున్న కాలేజీ అమ్మాయిలకు, మహిళలకు తాను గొప్పగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. జీఎస్‌టీ గురించి పూర్తిగా తెలియకుండానే దాడి స్వభావంగల ఆందోళనకారుల నోర్లు మూతపడేలా మరింత బిగ్గరగా, స్వేచ్ఛగా ఈ జీఎస్‌టీ గురించి మాట్లాడాలని తాను వారిని ( కాలేజ్‌ గర్ల్స్‌, మహిళలు) కోరుతున్నానని చెప్పారు. శృంగారంలోని అందాన్ని నీచమైన ఆలోచనగలవారు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement