'ఆ సినిమా చూసి నాకు ఏడుపొచ్చింది' | 'Govindudu Andarivadele' left me in tears, says Bandla Ganesh | Sakshi
Sakshi News home page

'ఆ సినిమా చూసి నాకు ఏడుపొచ్చింది'

Sep 29 2014 12:58 PM | Updated on Sep 2 2017 2:07 PM

'ఆ సినిమా చూసి నాకు ఏడుపొచ్చింది'

'ఆ సినిమా చూసి నాకు ఏడుపొచ్చింది'

రెండు రోజుల్లో విడుదల కాబోతున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తొలికాపీ చూసిన తర్వాత తనకు కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోయాయని చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు.

రెండు రోజుల్లో విడుదల కాబోతున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తొలికాపీ చూసిన తర్వాత తనకు కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోయాయని చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ఈ సినిమా తన కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా బుధవారం నాడు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఎంత ఎమోషన్ చూసినా తాను సాధారణంగా కన్నీరు పెట్టనని, కానీ ఇది చూసిన తర్వాత మాత్రం వాటిని ఆపుకోలేకపోయానని గణేశ్ అన్నారు.

బాపు గారి అత్యుత్తమ చిత్రం 'ముత్యాల ముగ్గు' అయితే.. కృష్ణవంశీ అత్యుత్తమ చిత్రం 'గోవిందుడు..' అవుతుందని చెప్పారు. అది విడుదలైన తర్వాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అనే విషంలో తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, కమలినీ ముఖర్జీ, శ్రీకాంత్, ఆదర్శ్ బాలకృష్ణ కూడా ఉన్నారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement