సౌఖ్యం | gopichand new movie | Sakshi
Sakshi News home page

సౌఖ్యం

Nov 15 2015 11:15 PM | Updated on Sep 3 2017 12:32 PM

సౌఖ్యం

సౌఖ్యం

నలుగురూ బాగుండాలని కోరుకునే మంచి మనసు అతనిది. వాళ్ల సౌఖ్యం కోసం ఏమైనా చేయడానికి వెనకాడడు.

నలుగురూ బాగుండాలని కోరుకునే మంచి మనసు అతనిది. వాళ్ల సౌఖ్యం కోసం ఏమైనా చేయడానికి వెనకాడడు. బేసిక్‌గా అతను చాలా డైనమిక్. ఆత్మీయుల క్షేమం కోసం ఎలాంటివాళ్లనయినా ఢీ కొనడానికి రెడీ అవుతాడు. వాళ్ల ఆనందం కోసం కామెడీ చేయడానికి కూడా వెనకాడడు.

ఇలా యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్ అయిన కథాంశంతో గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సౌఖ్యం’. ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా పూర్తయ్యింది. యూత్, ఫ్యామిలీస్ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుందని దర్శక-నిర్మాతలు తెలిపారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement