'శక్తిమాన్' మళ్లీ వస్తున్నాడోచ్! | Good News! 'Shaktimaan' to Make A Comeback on Indian Television | Sakshi
Sakshi News home page

'శక్తిమాన్' మళ్లీ వస్తున్నాడోచ్!

May 6 2016 6:13 PM | Updated on Sep 3 2017 11:32 PM

'శక్తిమాన్' మళ్లీ వస్తున్నాడోచ్!

'శక్తిమాన్' మళ్లీ వస్తున్నాడోచ్!

పిల్లలు ఒకప్పుడు బాగా ఇష్టపడిన ఫేమస్ షో 'శక్తిమాన్' త్వరలో మళ్లీ బుల్లితెర మీద సందడి చేయనుంది.

పిల్లలు ఒకప్పుడు బాగా ఇష్టపడిన ఫేమస్ షో 'శక్తిమాన్' త్వరలో మళ్లీ బుల్లితెర మీద సందడి చేయనుంది. కొత్త సిరీస్ రిటర్న్ ఆఫ్ శక్తిమాన్‌ను ప్రసారం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు శక్తిమాన్ పాత్రను పోషించిన ముఖేష్ ఖన్నా తెలిపారు. ప్రస్తుతం కొన్ని ఛానెళ్లను మాత్రమే సంప్రదించినట్లు ఆయన తెలిపారు. విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

శక్తిమాన్ రిటర్న్స్‌లో  నటించడానికి మళ్లీ రెడీ అయిన ఖన్నా.. ఇప్పటికే లుక్ మార్చుకోవడంతో పాటు 8 కేజీల బరువు కూడా తగ్గారు.  ప్రస్తుతం తాను  సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఏం ప్రయత్నం చేయడం లేదని.. కానీ, 15 ఏళ్ల కిందట ఎలా కనిపించానో అలాగే ఉండటానికి మాత్రం ప్రయత్నిస్తున్నానని ఖన్నా వివరించారు. ప్రజలు ఖన్నానే శక్తిమాన్ గా భావిస్తారని... అందుకే స్వయంగా రీమేక్ కు సిద్ధమవుతున్నట్లు ఆయన తెలిపారు.

తాను మహాభారతంలో భీష్ముడిగా నటించినప్పుడు చాలా చిన్నవాడినని, ఒక నటుడు నటించడానికి వయసుతో సంబంధం ఉండదని తాను నమ్ముతానని ఆయన అన్నారు. మొత్తానికి పిల్లలకు ఇష్టమైన శక్తిమాన్ తిరిగి వచ్చేస్తున్నాడు.. మరి అప్పటి విలన్ కిల్విష్ కూడా తిరిగి వస్తాడా? వేచిచూద్దాం..!

Advertisement
 
Advertisement
Advertisement