జీవీతో జెనీలియా రీఎంట్రీ | Genelia Re entry in gv movie | Sakshi
Sakshi News home page

జీవీతో జెనీలియా రీఎంట్రీ

Sep 27 2016 2:52 AM | Updated on Sep 18 2019 2:52 PM

జీవీతో జెనీలియా రీఎంట్రీ - Sakshi

జీవీతో జెనీలియా రీఎంట్రీ

నటి జెనీలియాను దక్షిణాది సినిమా అంత సులభంగా మరచిపోదు. కారణం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి

నటి జెనీలియాను దక్షిణాది సినిమా అంత సులభంగా మరచిపోదు. కారణం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అంతగా తనదైన ముద్ర వేసుకున్నారిక్కడ. తమిళంలో సచిన్, సంతోష్ సుబ్రమణియన్ లాంటి చాలా తక్కువ చిత్రాల్లో నటించినా, తెలుగులో పలు చిత్రాలు చేశారు. నటిగా మంచి లైమ్‌టైమ్‌లో ఉండగానే హిందీ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లాడి సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. అలా నటనకు దూరం అయిన జెనీలియా సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం.
 
 అదీ కోలీవుడ్‌లో నటించనున్నారు. ఇప్పటి వరకూ కుర్ర హీరోయిన్లతో నటిస్తున్న జీవీ.ప్రకాశ్‌కుమార్ ఇప్పుడు జెనీలియాతో రొమాన్స్ చేయనున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న జీవీ.ప్రకాశ్‌కుమార్ చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఉన్నాయి. వాటిలో బ్యూస్‌టీ, కడవుల్ ఇరుక్కాన్ కుమారు చిత్రాలు త్వరలో విడుదలకు ముస్తాబవుతున్నాయి. కాగా తాజాగా రామ్‌బాలా దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. సంతానం హీరోగా నటించిన సూపర్‌హిట్ చిత్రం దిల్లుక్కు దుడ్డు చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన దర్శకుడు రామ్‌బాలా అన్నది గమనార్హం. ఈయన దర్శకత్వంలో జీవీ నటించనున్న చిత్రాన్ని స్టీఫెన్ నిర్మించనున్నారు.
 
  ఇందులో జీవీకి జంటగా నటి జె నీలియా నాయకిగా నటించనున్నట్లు సమాచారం. కాగా ఇందులో హాస్య భూమికను వైగై పులి వడివేలు నటించడం మరో విశేషం. 2011 శాసనసభ ఎన్నికల తరువాత వడివేలు నటనకు దూరం అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఎలి అనే చిత్రంలో హీరోగా నటించినా ఆ చిత్రం ఆయన్ని నిరాశపరిచింది. చాలా గ్యాప్ తరువాత వడివేలు తన పాత బాణీకి మారారు. విశాల్ హీరోగా నటిస్తున్న కత్తిసండై చిత్రంలో హాస్య పాత్రతో రీఎంట్రీ అయ్యారు. తాజాగా జీవీ చిత్రంలో నటించనున్నారన్న మాట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement