
భర్తకు అండగా...
అందం, అమాయకత్వం కలగలిసిన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ జెనీలియా. నటనతో పాటు ఆమెలో
అందం, అమాయకత్వం కలగలిసిన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ జెనీలియా. నటనతో పాటు ఆమెలో మరో ప్రతిభ కూడా ఉందంటున్నారు జెనీలియా భర్త, హిందీ హీరో రితేశ్ దేశ్‌ముఖ్. అదేంటంటే... ఆమెలో మంచి నిర్మాత లక్షణాలు కూడా ఉన్నాయట. పెళ్లైన తర్వాత ఎక్కువగా ఇంటికి పరిమితమైన ఈ బ్యూటీ భర్తకు అండగా నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకున్నారట! హీరోగా నటిస్తూనే, రెండు మరాఠీ సినిమాల్లో రితేశ్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఓ మరాఠీ సినిమా నిర్మించాలనుకుంటున్నారు. ఆ చిత్రాల నిర్మాణ కార్యకలాపాలను జెనీలియా చూసుకుంటుందని రితేశ్ తెలిపారు. సౌత్‌లో హీరోయిన్‌గా నటించినప్పటి నుంచి ప్రొడక్షన్ అంటే ఆమెకు ఆసక్తి ఉందట. అది ఇప్పుడు నెరవేర్చుకుంటు న్నారు. అన్నట్టు.. రితేశ్ నటించిన మరాఠీ సినిమా ‘లయ్ భారి’కి నిర్మాత జెనీలియానే.