అసోసియేషన్‌ నుంచి వైదొలిగిన నటీమణులు

Four Malayalam Actress Resigned AMMA - Sakshi

దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి భావన సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమ్మ(అసోసియేషన్‌ ఆఫ్‌ మళయాళం మావీ ఆర్టిస్ట్స్‌) నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఆమెతో పాటు నటిమణులు రిమా కలింగల్‌, రమ్య నంబిసన్‌, గీత్‌ మోహన్‌దాస్‌లు కూడా అమ్మకు రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా తెలియజేశారు.

గతేడాది భావనపై నటుడు దిలీప్‌ లైగింక వేధింపు పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో దిలీప్‌ను అరెస్ట్‌ చేయడంతో అమ్మ అతనిపై నిషేధం విధించింది.​ తాజాగా అతనిపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో వీరు నలుగురు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అ నటుడి వల్ల గతంలో నేను ఎన్నో అవకాశాలు కొల్పోయాను.. కానీ అమ్మ​ ఏం చేయలేకపోయిందని భావన తెలిపారు. అమ్మలో కొనసాగడం అనవసరమంటూ ఆమె పేర్కొన్నారు. అమ్మ మహిళల కోసం ఏ విధమైన చర్యలు చెప్పట్టడం  లేదని రిమా చెప్పారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top