 
															నేను ఆంటీని కాదు: కత్రినా కైఫ్
బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ కు ఊహించని షాక్ తగిలింది.
	బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ కు ఊహించని షాక్ తగిలింది. బజరంగీ భాయ్ జాన్ సినిమాతో పరిచయమైన చిన్నారి నటి హర్షాలీ మల్హోత్రా కత్రినాని ఆంటీ అని  సంభోదించడమే ఇందుకు కారణం. గత  శనివారం కత్రినా తన 33వ పుట్టిన రోజును జరుపుకుంది.
	
	ఈ సదర్భంగా  హర్షాలీ ఫేస్ బుక్ లో కత్రినాతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసింది.  హ్యాపీ బర్త్ డే... కత్రినా కైఫ్ ఆంటీ అని ట్యాగ్ లైన్ ని రాసి పోస్టు చేసింది. థ్యాంక్యూ  లవ్ యూ అని రిప్లే ఇచ్చిన కత్రినా తనను ఆంటీ అని కాకుండా అక్క అని పిలవాలని రిప్లే ఇచ్చింది.
	

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
