జాతీయ స్థాయి నటిని కించపరుస్తారా?

Fans Fires Over Anushka Fat Shaming Comments - Sakshi

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క కొంత గ్యాప్‌ తర్వాత నటిస్తున్న మూవీ ‘నిశ్శబ్ధం’. మాధవన్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి, షాలిని పాండే ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ఇటీవలే హైదరాబాద్‌ విమానాశ్రయంలో అనుష్క కనిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో అనుష్క ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అనుష్క లుక్‌పై మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే దీనిపై ఓ తెలుగు మూవీ వెబ్‌సైట్‌ రాసిన వ్యాఖ్యలపై స్వీటీ అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. 

సదరు వెబ్‌సైట్‌ ‘‘ఎయిర్‌పోర్టులో అనుష్కను చూసిన తన అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. కొంత కాలంగా అనుష్క అధిక బరువు సమస్యతో బాధపడుతుంది. తనను చూస్తుంటే చాలా బరువుగా, ఉబ్బిన చెంపలతో కనిపిస్తోంంది’’ అని రాశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఒక అమ్మాయిని ఇంత అసభ్యకరంగా వర్ణిస్తారా అని మండిపడుతున్నారు. ఒక జాతీయ స్థాయి నటిని ఈ విధంగా కించపరచడం సరికాదని, అనుష్క కాలికి కూడా మీరు సరిపోరని సంబంధిత వెబ్‌సైట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తలు రాసేముందు చేతులు.. మాట్లాడేముందు నోరు అదుపులో పెట్టుకోండి అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. (చదవండి: షాక్‌ ఇస్తోన్న అనుష్క లుక్‌!)

‘వార్తలు రాసే ముందే  జర్నలిజం విలువలను గుర్తు పెట్టుకొండి. తన శరీరాకృతిపై సిగ్గు పడాల్సిన అవసరం అనుష్కకు లేదు. కానీ ఇతరుల గురించి అలా మాట్లాడటానికి మీకు సిగ్గుండాలి’ అని ఓ నెటిజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అక్టోబర్‌ 2న విడుదల కానున్న చిరంజీవి.‘సైరా నర్సింహరెడ్డి’ చిత్రంలో అనుష్క ఝాన్సీ లక్ష్మీభాయ్‌ పాత్రలో కనిపించననున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top