మీడియాను ఎదుర్కోవడం అంత తేలికేం కాదు | Facing media not easy says Amitabh Bachchan | Sakshi
Sakshi News home page

మీడియాను ఎదుర్కోవడం అంత తేలికేం కాదు

May 29 2015 4:43 PM | Updated on Oct 9 2018 6:34 PM

మీడియాను ఎదుర్కోవడం అంత తేలికేం కాదు - Sakshi

మీడియాను ఎదుర్కోవడం అంత తేలికేం కాదు

మీడియాను ఎదుర్కోవడం అంత సులభం కాదని బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ అన్నారు.

ముంబయి: మీడియాను ఎదుర్కోవడం అంత సులభం కాదని బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ అన్నారు. వారి ఓ నటుడు వ్యక్తి గత విషయాలను, వృత్తి సంబంధమైన విషయాలను తెలుసుకోవాలని ఆరాటపడుతూనే ఉంటారని, చివరికి వాటిని తెలుసుకునే విషయంలో వారే గెలుస్తారని చెప్పారు. పలు వార్త సంస్థలను ఇప్పటికే కలుసుకున్న ఆయన మీడియాపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

'రోజంతా విలేకరులతో, ఇంకొందరు మీడియా వ్యక్తులతో ఉన్నా. ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు చర్చించాను. అయితే, ప్రతిసారి వారిదే పైచేయి, మీడియా ఎప్పుడూ గెలుస్తుంది. విలేకరులు ఎప్పుడూ గెలుస్తారు. గతంలోకి తీసుకెళుతారు, ఓడిస్తారు, సీట్లో నుంచి కదలకుండా చేస్తారు' అని అమితాబ్ చెప్పారు. అంతేకాదు ఫోర్త్ ఎస్టేట్ ను ఎదుర్కోవడం అంత తేలిక కాదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement