ఇది నాకు చాలా స్పెషల్ | Ee Varsham Sakshiga movie Song innovation | Sakshi
Sakshi News home page

ఇది నాకు చాలా స్పెషల్

Nov 13 2014 1:10 AM | Updated on Sep 2 2017 4:20 PM

ఇది నాకు చాలా స్పెషల్

ఇది నాకు చాలా స్పెషల్

‘‘మంచి పొయెటిక్ టైటిల్‌తో చేసిన ఈ సినిమా నాకు చాలా స్పెషల్.

 - వరుణ్ సందేశ్
‘‘మంచి పొయెటిక్ టైటిల్‌తో చేసిన ఈ సినిమా నాకు చాలా స్పెషల్. అనిల్ గోపిరెడ్డి సంగీతం ఈ చిత్రానికి మెయిన్ ఎట్రాక్షన్’’ అని వరుణ్ సందేశ్ చెప్పారు. వరుణ్ సందేశ్, హరిప్రియ జంటగా రమణ మొగిలి దర్శకత్వంలో రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై బి. ఓబుల్ సుబ్బారెడ్డి, శ్రీనివాస్ చవాకులు నిర్మించిన ‘ఈ వర్షం సాక్షిగా’ చిత్రం పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. వరుణ్‌సందేశ్ తాతయ్య, నానమ్మలు జీడిగుంట రామచంద్రమూర్తి, రాజ్యలక్ష్మి పాటల సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని నిర్మాత సుబ్బారెడ్డి తండ్రి శంకర్ రెడ్డికి అందించారు.

ఈ సందర్భంగా హరిప్రియ మాట్లాడుతూ -‘‘ఇందులోని ‘సీతా మహాలక్ష్మి’ పాట నా పాత్రను తెలియజేస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను’’ అన్నారు. ఇందులో హరిప్రియది చిరకాలం నిలిచిపోయే పాత్ర అని దర్శకుడు పేర్కొన్నారు. నిర్మాత ఓబుల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ -‘‘నేను భోజ్‌పురిలో మూడు సినిమాలు నిర్మించా. తెలుగులో ఇదే తొలి చిత్రం’’ అని తెలిపారు. ఈ వేడుకలో వీరశంకర్, విజయ్‌కుమార్ కొండా, నీలకంఠ, మదురా శ్రీధర్ తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement