దిలీప్‌ కుమార్‌ క్షేమంగా ఉన్నారు | dileep kumar recovering well, says doctors | Sakshi
Sakshi News home page

దిలీప్‌ కుమార్‌ క్షేమంగా ఉన్నారు

Dec 8 2016 9:04 AM | Updated on Sep 4 2017 10:14 PM

దిలీప్‌ కుమార్‌ క్షేమంగా ఉన్నారు

దిలీప్‌ కుమార్‌ క్షేమంగా ఉన్నారు

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ (93) ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది.

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌ (93) ఆరోగ్యం మెరుగవుతోంది. దిలీప్‌ కుమార్‌ క్షేమంగా ఉన్నారని,  క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.

దిలీప్‌ కుమార్‌ తీవ్ర జ్వరంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం వైద్యులు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. దిలీప్‌ కుమార్‌ను త్వరలోనే ఐసీయూ నుంచి షిఫ్ట్ చేస్తామని తెలిపారు.

ఇంతకుముందు కూడా దిలీప్‌ కుమార్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వదంతులు కూడా వ్యాపించాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆయన లీలావతి ఆస్పత్రిలోనే చికిత్స పొందారు.

Advertisement
 
Advertisement
Advertisement