అప్పుడు విలన్‌ రోల్ ఇవ్వలేదు.. కానీ! | Dil Raju Invites Adivi Sesh to Work in SVC Banner | Sakshi
Sakshi News home page

అప్పుడు విలన్‌ రోల్ ఇవ్వలేదు.. కానీ!

Aug 17 2019 4:35 PM | Updated on Aug 17 2019 5:06 PM

Dil Raju Invites Adivi Sesh to Work in SVC Banner - Sakshi

స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎవరు. తొలి షో నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సినిమా సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న నిర్మాత దిల్‌ రాజు ‘ఎవరు’ టీంను అభినందించారు. ఈ సందర్భంగా అడివి శేష్‌తో తమ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తామని ప్రకటించారు.

అయితే ఈ ఆఫర్‌పై హీరో అడివి శేష్‌ ఆసక్తికరంగా స్పందించారు. గతంలో దిల్ రాజు నిర్మించిన ఎవడు సినిమాలో విలన్‌ రోల్‌ కోసం అడివి శేష్‌ ప్రయత్నించాడు. అయితే వివిధ కారణాల వల్ల అప్పుడు ఆ రోల్ తనకి దక్కలేదని చెప్పాడు. ఇప్పుడు ఎవరు సినిమా సక్సెస్‌ తరువాత దిల్ రాజు స్వయంగా అడివి శేష్‌ను తన బ్యానర్‌లో సినిమా చేయమని అడగటంతో మరింత ఆనందంగా ఉన్నాడు శేష్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement