యువ కళా కెరటం

Dancer Shiva Kumar Special Story - Sakshi

ఇటు నృత్యం.. అటు సాహిత్యం

విభిన్న రంగాల్లో రాణిస్తున్న శివకుమార్‌  

జవహర్‌నగర్‌: ఇటు నృత్యం.. అటు సాహిత్యంలో రాణిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు జవహర్‌నగర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని శివాజీనగర్‌కు చెందిన వేములవాడ శివకుమార్‌. పేదరికం కళకు అడ్డు కాదని నిరూపిస్తున్నాడు. నృత్యంతో మొదలైన తన ప్రస్థానం ప్రస్తుతం సాహిత్యం దిశగా సాగుతోంది. ఆల్బమ్స్‌ సైతం రూపొందిస్తున్నాడు. ఆరో తరగతి నుంచే డ్యాన్స్‌ నేర్చుకున్న శివ.. ఆ విద్యను పది మందికి అందజేస్తున్నాడు.   

ఆల్బమ్స్‌ రూపకల్పన...  
ఇంటర్‌ పూర్తి చేసిన శివకుమార్‌ జవహర్‌నగర్‌లో ‘అమ్మ’ నృత్య శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. తక్కువ ఫీజులు తీసుకుంటూ నటన, నృత్యంలో శిక్షణనిస్తున్నాడు. శివకుమార్‌ నృత్య రంగంలో రాణిస్తూనే.. మరోవైపు లఘు చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ‘అమ్మ క్రియేషన్స్‌’ పేరుతో  ‘చెలియా సఖియా.. అందాల పువ్వేదో.. ‘అను అను అనురాగం.. హృదయమా... కళ్లలోనూ కలలే కంటూ’ అనే గీతాలతో ఓ ఆల్బమ్‌ రూపొందించాడు. భవిష్యత్‌లో సినీ రంగంలో అడుగు పెట్టాలనే ఆశయంతో ముందుకెళ్తున్నాడు.

లిరిక్‌ రైటర్‌ కావాలని..  
సాధ్యమైనంత వరకు కళను పది మందికి పంచడమే నా ఆశయం. ఇప్పటి వరకు ఎన్నో కవితలు రాశాను. ‘ఇట్స్‌ మై లవ్‌’ ఆల్బమ్‌ విడుదల చేశాను. మ్యూజిక్‌ యాంకర్‌ భార్గవ్‌తో రెండు పాటలను చిత్రీకరించాను. దానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. యాంకర్‌ రవి, లాస్యలతో ఆల్బమ్‌ రూపొందించాం. భవిష్యత్‌లో సినీగేయ రచయిత కావడమే నా ధ్యేయం.       – శివకుమార్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top