
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి షెడ్యుల్ కూడా పూర్తైయినట్లు, త్వరలో రెండో షెడ్యల్‌లో పాల్గొంటాను అంటూ పూజా హెగ్డే ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అయితే ఇదే షెడ్యూల్ కమెడియన్‌గా, హీరోగా ప్రేక్షకులను మెప్పిస్తున్న శ్రీనివాస్ రెడ్డి కూడా ఇదే షెడ్యూల్ పాల్గొన్నాడు.
అయితే శ్రీనివాస్ రెడ్డికి, ఎన్టీఆర్‌కు పడటం లేదని.. శ్రీనివాస్‌రెడ్డి షూటింగ్‌కు వచ్చినప్పటినుంచి ఎన్టీఆర్ మూడీగా ఉంటున్నారని వార్తలు వినిపించాయి. అయితే అదంతా గాసిప్ రాయుళ్ల పనే అని శ్రీనివాస్‌రెడ్డి ఒక్క పిక్‌తో తేల్చేశాడు. ‘మధురం.. మధురం.. ఈ సమయం’ అంటూ త్రివిక్రమ్, ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తున్న ‘జంబ లకిడి పంబ’ జూన్ 22న విడుదల కానుంది.
Madhuram Madhuram eh Samayam 😍😍😍😍😍 pic.twitter.com/KhtriE839E
— Srinivasareddy (@Actorysr) June 9, 2018