‘కాటమరాయుడా...’ | chandra siddhartha ready to make ‘Katam Rayuda ... ' | Sakshi
Sakshi News home page

‘కాటమరాయుడా...’

Sep 24 2013 2:58 AM | Updated on Aug 28 2018 4:30 PM

‘కాటమరాయుడా...’ - Sakshi

‘కాటమరాయుడా...’

సినిమా ద్వారా నాలుగు మంచి విషయాలు చెబితే... ‘ఆర్ట్ ఫిలిం’ అని తేలిగ్గా పెదవి విరిచేసే రోజులివి. అయితే... చేదైన మంచిని కూడా తీయని రసగుల్లాలా నోటికి అందించడంలోనే ఉంది అసలైన ప్రజ్ఞ. దర్శకుడు చంద్రసిద్దార్థ్ చేసేది అదే.

సినిమా ద్వారా నాలుగు మంచి విషయాలు చెబితే... ‘ఆర్ట్ ఫిలిం’ అని తేలిగ్గా పెదవి విరిచేసే రోజులివి. అయితే... చేదైన మంచిని కూడా తీయని రసగుల్లాలా నోటికి అందించడంలోనే ఉంది అసలైన ప్రజ్ఞ. దర్శకుడు చంద్రసిద్దార్థ్ చేసేది అదే. ఆ నలుగురు, మధుమాసం, ఇదీ సంగతి, అందరిబంధువయ.. ఇలా ఆయన తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి కనిపిస్తూనే ఉంటుంది. 
 
 అయితే... ఆ మంచి కూడా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది. దటీజ్ చంద్రసిద్దార్థ్. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఏమో గుర్రం ఎగురావచ్చు’. సుమంత్, పింకీ సావిక జంటగా చేసిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత చంద్రసిద్దార్థ్ భిన్నమైన కథాంశంతో మరో సినిమా చేయబోతున్నారు. 
 
 ‘కాటమరాయుడా...’ అనేది ఈ సినిమా టైటిల్. ఫిల్మోత్సవ్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై చంద్రసిద్దార్థ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం డిసెంబర్‌లో సెట్స్‌కి వెళ్లనుంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement