ఆ నలుగురు దర్శకుడి 'ఆటగదరా శివా..!' | chandra siddhartha Next Movie aata gadara siva | Sakshi
Sakshi News home page

ఆ నలుగురు దర్శకుడి 'ఆటగదరా శివా..!'

Apr 15 2017 12:05 PM | Updated on Sep 5 2017 8:51 AM

ఆ నలుగురు దర్శకుడి 'ఆటగదరా శివా..!'

ఆ నలుగురు దర్శకుడి 'ఆటగదరా శివా..!'

ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి సందేశాత్మక చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో

ఆ నలుగురు, అందరి బంధువయా లాంటి సందేశాత్మక చిత్రాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రసిద్ధార్థ్ దర్శకత్వంలో అదే బాటలో మరో సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ నిర్మాత రాక్లైన్ వెంకటేష్ నిర్మాణ సారథ్యంలో ఆటగదరా శివా అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సందేశాత్మక అంశాలతో పాటు ఆధ్యాత్మిక భావాలను కూడా చూపేలా ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమాను అంతా కొత్తవారితోనే తెరకెక్కించాలని నిర్ణయించారు. తెలుగులో పవర్ సినిమాతో పాటు రజనీకాంత్ హీరోగా లింగా సినిమాను నిర్మించిన రాక్లైన్ వెంకటేష్, బాలీవుడ్ సినిమా భజరంగీ బాయ్ జాన్కు సహనిర్మాతగా వ్యవహరించారు. ఆటగదరా శివా సినిమాను కూడా తన గత చిత్రాల స్థాయిలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున ప్రారంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement