త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌ | Censor Board Refused U Certificate For Trisha New Movie | Sakshi
Sakshi News home page

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

Published Tue, Sep 24 2019 7:32 AM | Last Updated on Tue, Sep 24 2019 11:41 AM

Censor Board Refused U Certificate For Trisha New Movie - Sakshi

నటి త్రిష చిత్రానికి సెన్సార్‌బోర్డు షాక్‌ ఇచ్చింది. 36 ఏళ్లయినా కొంచెం కూడా క్రేజ్‌ తగ్గని ఈ బ్యూటీ చేతిలో అరడజనుకుపైగా చిత్రాలు ఉన్నాయి. ఈ మధ్య విజయ్‌సేతుపతితో రొమాన్స్‌ చేసిన 96 చిత్రం, రజనీకాంత్‌కు జంటగా నటించిన పేట చిత్రాల విజయాలు త్రిషకు మరింత ప్రోత్సహించేలా అమిరాయి. దీంతో ఈ చిన్నది తమిళ చిత్రాలపైనే పూర్తిగా దృష్టి సారిస్తోంది. కాగా త్రిష నటిస్తున్న పలు చిత్రాల్లో పరమపదం విలయాట్టు చిత్రం ఒకటి. ఇది హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రం. ఇందులో త్రిష తల్లిగా నటించింది. పగ, ప్రతీకారాలతో కూడిన ఈ పరమపదం విలయాట్టు చిత్రం కోసం ఈ అమ్మడు ఫైట్స్‌ కూడా చేసిందట. చిత్ర నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న పరమపదం విలయాట్టు చిత్రం ఇటీవల సెన్సార్‌ పూర్తి చేసుకుంది.

కాగా ఇది కుటుంబ కథా చిత్రం కాబట్టి సెన్సార్‌ నుంచి యూనిట్‌ వర్గాలు యు సర్టిఫికెట్‌ను ఆశించారు. అయితే సెన్సార్‌ బోర్డు వారికి షాక్‌ ఇచ్చింది. యు/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఇది పరమపదం విలయాట్టు చిత్ర వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసిందట. ఇది హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం అని.. అందుకే యు సర్టిఫికెట్‌ను ఇవ్వలేమని సెన్సార్‌సభ్యులు తెగేసి చెప్పారని సమాచారం.  చిత్రంలో త్రిష శత్రువులను ఘోరాతి ఘోరంగా చంపుతుందట. దీంతో  యు/ఏ సర్టిఫికెట్‌నే సరిపెట్టుకున్న పరమపదం విలయాట్టు చిత్రాన్ని త్వరలో ట్రైలర్‌ను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. కాగా ప్రస్తుతం త్రిష  రాంగీ అనే మరో హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రంలో నటిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement