నాని గట్స్‌కు హ్యాట్సాఫ్‌

Celebrities Opinion on Nani Awe Movie  - Sakshi

సాక్షి, సినిమా : హీరోగా వరుస సక్సెస్‌లు అందుకుంటున్న నేచురల్‌ స్టార్‌ నాని.. అ! చిత్రంతో నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైపోయాడు. టీజర్‌, ట్రైలర్‌, ప్రోమోలు, ప్రమోషన్లతో బాగానే హైప్‌ తీసుకొచ్చిన నాని.. ఇప్పుడు మౌత్‌ టాక్‌పై కూడా దృష్టిసారించాడు. అందుకే సినిమా విడుదలకు ముందే సెలబ్రిటీలకు ఇక్కడ ప్రత్యేక షో వేయించి వారితో అభిప్రాయాలను చెప్పిస్తున్నాడు. 

వెన్నెల కిషోర్‌, అనుపమ పరమేశ్వరన్‌, అడివి శేష్‌, దర్శకనిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి, నటుడు శశాంక్‌, డిజైనర్‌ నీరజ్‌ కోన, రాహుల్‌ రవీంద్రన్‌ ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ చిత్రాన్ని వీక్షించి తమ ట్విటర్‌లో ట్వీట్లు చేశారు. ‘అ చిత్రం కొత్త తరహా కాన్సెప్ట్‌తో కూడిన చిత్రమని, అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటుందని, దర్శకుడు ప్రశాంత్‌ టేకింగ్‌ కొత్తగా.. ఆకట్టుకునేలా ఉందని, ముగింపు ఓ కవిత్వంలా ఆహ్లాదంగా అనిపించిందని చెబుతున్నారు. ముఖ్యంగా నిర్మాతగా ఇలాంటి చిత్రం నిర్మించాలంటే చాలా గట్స్‌ ఉండాలంటూ ప్రతీ ఒక్కరూ నానిని ప్రశంసిస్తున్నారు.

కాజల్‌, నిత్యామీనన్‌, రెజీనా, అవసరాల, ఇషా రెబ్బా, మురళీ శర్మ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్‌ చేశాడు. మరి ఈ చిత్రం నానికి నిర్మాతగా సక్సెస్‌ అందిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది గంటలు ఆగితే చాలూ.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top