'కాశ్మీర్' లో షూటింగ్ కోసం నిరీక్షణ! | Can't wait to shoot in Kashmir, says Ali Fazal | Sakshi
Sakshi News home page

'కాశ్మీర్' లో షూటింగ్ కోసం నిరీక్షణ!

Jul 5 2014 2:58 PM | Updated on Apr 3 2019 6:23 PM

'కాశ్మీర్' లో షూటింగ్ కోసం నిరీక్షణ! - Sakshi

'కాశ్మీర్' లో షూటింగ్ కోసం నిరీక్షణ!

' బాబీ జాసెస్' విడుదలైన అనంతరం నటుడు ఆలీ ఫజల్ మరో చిత్ర షూటింగ్ కు సిద్ధమవుతున్నాడు.

ముంబై:' బాబీ జాసెస్' విడుదలైన అనంతరం నటుడు ఆలీ ఫజల్ మరో చిత్ర షూటింగ్ కు సిద్ధమవుతున్నాడు. ముఖేష్ భట్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న 'ఖామోషియన్' చిత్రంలో ఆలీ ఫజల్ నటించనున్నాడు. ఇందులో భాగంగానే ఆ షూటింగ్ ను కాశ్మీర్ లో చేయదలచుకున్నారు. ఆ షూటింగ్ కోసం ఆలీ ఫజల్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడట. ఆ విషయాన్ని అతనే స్వయంగా ప్రకటించాడు. 'ఆ సినిమా షూటింగ్ ను కాశ్మీర్ లో ఎప్పుడు చేస్తారా?అని నిరీక్షిస్తున్నాను. నేను ఇప్పటి వరకూ కాశ్మీర్ చూడలేదు. నాన్న శ్రీనగర్ కు కాలేజీకి వెళ్లడమే మాత్రమే నాకు తెలుసు.  కాశ్మీర్ వాలీ అద్భుతంగా ఉంటుందని తల్లి దండ్రులు చెప్పగా విన్నాను' అంటూ కాశ్మీర్ పై తన ప్రేమను తెలియజేశాడు ఫజల్. 

 

కాశ్మీర్ లో షూటింగ్ త్వరలో ప్రారంభిస్తున్నట్లు చిత్ర నిర్మాత ముఖేష్ భట్  ప్రకటించడంతో చెప్పలేని సంతోషంతో ఉన్నానని అన్నాడు. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ లో కాశ్మీర్ లో జరిగే అవకాశం ఉందన్నాడు. అక్కడ దాదాపు 15 రోజుల పాటు షూటింగ్ ఉంటుందని ఫజల్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement