బీటెక్ బాబుల కథ! | BTech Babu story! | Sakshi
Sakshi News home page

బీటెక్ బాబుల కథ!

Aug 1 2015 12:48 AM | Updated on Sep 3 2017 6:31 AM

బీటెక్ బాబుల కథ!

బీటెక్ బాబుల కథ!

ఆ నలుగురూ అప్పుడే కాలేజీ అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

 ఆ నలుగురూ అప్పుడే కాలేజీ అనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.ఆ తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులేమిటనే కథాంశంతో  తెరకెక్కుతున్న చిత్రం  ‘బి.టెక్ బాబులు’. శార్యా, రోషిణి, అశ్విని, షకలక శంకర్ ముఖ్యతారలుగా మధు వర్మ, రవి మామిడి, జమ్ముధన, సత్యనారాయణ కాజా, ప్రవీణ్ బూడి, కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శీను ఇమండి దర్శకుడు.
 
 ఈ చిత్రం లోగో ఆవిష్కరణ  శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఆద్యంతం నవ్వించేలా ఈ చిత్రాన్ని  రూపొందిస్తున్నాం. నెలాఖరులో పాటలను, చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు తె లిపారు.   సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, కథానాయికలు రోషిణి, అశ్విని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement