లో దుస్తుల డిజైనర్‌గా..! | Britney Spears changed as inner wear designer | Sakshi
Sakshi News home page

లో దుస్తుల డిజైనర్‌గా..!

Jul 26 2014 12:00 AM | Updated on Sep 2 2017 10:52 AM

లో దుస్తుల డిజైనర్‌గా..!

లో దుస్తుల డిజైనర్‌గా..!

ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్న ప్రసిద్ధ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇప్పుడు డిజైనర్‌గా మారారు. కేవలం తన కోసం మాత్రమే కాదు.. అతివలందరి కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా బోల్డంత మంది అభిమానులను సంపాదించుకున్న ప్రసిద్ధ పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇప్పుడు డిజైనర్‌గా మారారు. కేవలం తన కోసం మాత్రమే కాదు.. అతివలందరి కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. లో దుస్తులు ఎలా ఉన్నా పైకి కనిపించే దుస్తులు బాగుంటే చాలని కొంతమంది అనుకుంటారనీ, అయితే లో దుస్తులు సౌకర్యవంతంగా ఉండకపోతే ధ్యాస అంతా వాటి మీదే ఉండి, మన పనులు మనం సరిగ్గా చేసుకోలేమనీ బ్రిట్నీ అంటున్నారు. అందుకే, శరీరానికి హాయినిచ్చే లో దుస్తులను డిజైన్ చేస్తున్నారామె. త్వరలోనే వీటి ఆవిష్కరణ జరగనుంది.
 
స్వయంగా బ్రిట్నీ డిజైన్ చేస్తే ఇక, అమ్మకానికి కొదవ ఏముంటుంది? ఆడవాళ్లే కాదు.. బ్రిట్నీ అభిమానులు తమ గాళ్‌ఫ్రెండ్స్‌కి వీటిని బహుమతిగా ఇస్తారని ఊహించవచ్చు. ఆ విధంగా ఆడా, మగా తేడా లేకుండా బ్రిట్నీ డిజైన్ చేసిన లో దుస్తులు స్టాక్ దొరకని స్థాయిలో కొనేస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మధ్య తాను కొంచెం బరువు పెరిగినట్లుగా బ్రిట్నీకి అనిపించిందట. ముఖ్యంగా తొడలు, నడుము భాగం కొలతలు పెరిగినట్లనిపించి, డాక్టర్‌ని సంప్రదించారట. లేజర్ ద్వారా అదనపు కొవ్వును కరిగించాలని నిర్ణయించుకున్నారట ఈ బ్యూటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement