బ్రిట్నీ కాలు జారె...అభిమానుల గుండె జారె! | Britney Spears cancels shows after Vegas fall | Sakshi
Sakshi News home page

బ్రిట్నీ కాలు జారె...అభిమానుల గుండె జారె!

May 1 2015 11:51 PM | Updated on Sep 3 2017 1:14 AM

బ్రిట్నీ కాలు జారె...అభిమానుల గుండె జారె!

బ్రిట్నీ కాలు జారె...అభిమానుల గుండె జారె!

అది లాస్ ఏంజిల్స్‌లోని ఓ క్యాసినో. ఆ రోజు ఇసుక వేస్తే రాలనంత జనంతో ఆ క్యాసినో కిటకిటలాడిపోయింది.

 అది లాస్ ఏంజిల్స్‌లోని ఓ క్యాసినో. ఆ రోజు ఇసుక వేస్తే రాలనంత జనంతో ఆ క్యాసినో కిటకిటలాడిపోయింది. దానికి కారణం - బ్రిట్నీ స్పియర్స్. పాప్ ప్రపంచంలో తిరుగు లేదనిపించుకున్న ఈ బ్యూటీ ఆ రోజు ఓ మ్యూజికల్ షో చేయడానికి సమాయత్తమయ్యారు. అందుకే అభిమానులు అక్కడ గుమిగూడిపోయారు. ఆ రోజు ఎప్పటిలానే బ్రిట్నీ స్పియర్స్ అందంగా ముస్తాబై, వేదిక పైకి వచ్చారు. మైక్ అందుకుని, పాడడం మొదలుపెట్టారు.
 
 డాన్స్ కూడా మొదలైంది. ఆట రసవత్తరంగా సాగుతున్న సమయంలో బ్రిట్నీ కాలు జారింది. ఆ జారుడుకు చీలమండ దగ్గర ఆమెకేదో అసౌకర్యంగా అనిపించింది. కానీ, అభిమానులనూ, షో నిర్వాహకులనూ నిరాశపరచడం ఇష్టం లేక పళ్ళ బిగువున డాన్స్ కొనసాగించారు. కానీ, నొప్పి పెరిగిపోవడంతో ప్రదర్శన ఆపి, ఎకాఎకిన ఆస్పత్రికి వెళ్లిపోయారామె. దాంతో అభిమానుల గుండె జారిపోయింది. బ్రిట్నీకి ఏమైందో ఏమోనని కంగారుపడిపోయారు.
 
  ఆ తర్వాత ట్విట్టర్ ద్వారా ‘‘నా మీద ప్రేమాభిమానాలు కనబరుస్తున్నందుకు ధన్యవాదాలు. చీలమండ దగ్గర బాగా దెబ్బ తగిలింది. మరేమీ ఫరవాలేదు. త్వరగా తగ్గిపోతుంది’’ అని అభిమానులకు తన ఆరోగ్య పరిస్థితిని బ్రిట్నీ తెలియజేశారు. దాంతో అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement