
నా నుంచి ఆశించడం తప్పు కాదు: పరిణితి
'నేనంటి సినీనటిని. ప్రేకులు టికెట్ కొనిమరీ సినిమాలు చూస్తారు. నేను ఎలా కనబడితే బాగుంటానో అలా కనబడాలని ప్రేక్షకుడు కోరుకోవటంలో తప్పులేదు.
ముంబై : ఇటీవలే ఫుల్ ఫిట్నెస్తో అందరూ కళ్లింతలు చేస్కుని తనవైపు చూసేలా చేసిన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా.. మహిళల శరీర ఆకృతికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'వనితల శరీరాకృతిని గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. మహిళలన్ని అగౌరవరవపరిచేలా వారి శరీరాకృతి గురించి మాట్లాడటం అనాగరికం కూడా' అంటూ చోప్రా చిరుకోపాన్ని ప్రదర్శించింది.
అయితే నిజంగానే శరీర ఆకృతి ఎవరికివాళ్లకు అసౌకర్యంగా అనిపిస్తే మార్చుకోవడంలో తప్పు లేదని, కంఫర్ట్ గా ఉండే హక్కు ఆడవారికీ ఉందని చెప్పుకొచ్చారు. మగువల సొంపులపై వ్యంగ్యంగా మాట్లాడొద్దంటూ హెచ్చరికలూ చేశారు. 'నేనంటి సినీనటిని. ప్రేక్షకులు టికెట్ కొనిమరీ సినిమాలు చూస్తారు. నేను ఎలా కనబడితే బాగుంటానో అలా కనబడాలని ప్రేక్షకులు కోరుకోవటంలో తప్పులేదు. కాబట్టే షేప్ విషయంలో నాకు సలహాలు, విమర్శలు తప్పవు' అని ప్రేక్షకులపట్ల కాస్త పరిణితితో మాట్లాడింది పరిణితి.
ఇంతకీ ఇండస్ట్రీని ఊపేసిన న్యూ లుక్ రహస్యం ఏమని అడిగితే.. బరువు తగ్గేందుకు ఎలాంటి డైట్ ఫాలో కాలేదని, బరువు తగ్గడం చాలా తేలికని మనసులో భావించి.. జిమ్, స్విమ్మింగ్, ట్రెడ్ మిల్, కిక్ బాక్సింగ్, స్ట్రెచింగ్, డ్యాన్స్ వగైరా చేయటం వల్లే న్యూ లుక్ సాధ్యమైందని చెప్పింది.