బిగ్‌బాస్‌ : అమిత్‌కు బంపర్‌ ఆఫర్‌! | Bigg Boss 2 Telugu Kamal Hassan Gave A Lucky Chance To Amit | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : అమిత్‌కు కమల్‌ హాసన్‌ బంపర్‌ ఆఫర్‌!

Aug 3 2018 11:51 PM | Updated on Jul 18 2019 1:45 PM

Bigg Boss 2 Telugu Kamal Hassan Gave A Lucky Chance To Amit - Sakshi

ప్రొగ్రామ్‌పై విమర్శలు చేస్తున్నారంటూ

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చేసరికి హౌజ్‌మేట్స్‌ సంతోషానికి ఆకాశమే హద్దు అన్నట్లు అయింది. ఈ యూనివర్సల్‌ హీరో తమ ముందు దర్శనమిచ్చేసరికి ఇంటి సభ్యులు తమ ఇష్టాన్ని, అభిమానాన్ని వ్యక్తపరిచారు. అందరూ కాళ్ల మీద పడి నమస్కరించారు. వారందరిని కమల్‌ హాసన్‌ ఎంతో ప్రేమగా పలకరించి హత్తుకున్నారు. కొంతమంది హౌజ్‌మేట్స్‌కు అది కలో నిజమో గుర్తించలేనంత ఆశ్యర్యానికి లోనయ్యారు. 

విశ్వరూపం2 ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చానని, మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చానంటూ కమల్‌ హాసన్‌ హౌజ్‌మేట్స్‌కు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను బిగ్‌బాస్‌ హౌజ్‌లో ప్లే చేయించారు. అనంతరం సినిమాకు పనిచేసిన మరికొంతమందిని కూడా హౌజ్‌లోకి విచ్చేశారు. హీరోయిన్‌ పూజా కూడా వచ్చారు. ఇంటి సభ్యులందరికి కమల్‌ హాసన్‌ విశ్వరూపం2 టీషర్ట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. తన టీమ్‌ సభ్యులైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ జిబ్రాన్‌, సినిమాటోగ్రఫర్‌ దత్‌, హీరోయిన్‌ పూజలను పరిచయం చేశారు. 

అమిత్‌ తనకిష్టమైన ట్యూన్‌ను కమల్‌కు వినిపించాడు. రోల్‌రైడా తన స్టైల్లో ర్యాప్‌ పాడి హోరెత్తించాడు. గీతా మాధురి కూడా కమల్‌ హిట్‌ సాంగ్‌ను పాడి వినిపించారు. కౌశల్‌ కోరిక మేరకు.. భారతీయుడు సినిమాలోని ‘అదిరేటి డ్రేస్సు’ సాంగ్‌ను ఇంటి సభ్యులు ఆలపిస్తుండగా.. తనదైన శైలీలో కమల్‌ హాసన్‌ నడుస్తూ ఇంటి సభ్యులను ఆనందపరిచారు. బిగ్‌బాస్‌ ప్రోగ్రామ్‌ గురించి కమల్ వ్యాఖ్యానిస్తూ.. కొంతమంది ఈ ప్రొగ్రామ్‌పై విమర్శలు చేస్తున్నారంటూ.. బయట జరిగేదే ఇక్కడ కూడా జరుగుతుందని.. ఇందులో తప్పేం లేదంటూ.. మరికొన్ని విషయాలను ఇంటి సభ్యులతో పంచుకున్నారు. 

అమిత్‌కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన కమల్‌

బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్‌ అందరిలోంచి ఒక్కరికి మాత్రం.. ఓ రెండు వారాలు ఎలిమినేషన్‌ కాకుండా ఉంటే పవర్‌ను ఇస్తానని కమల్‌ హాసన్‌ చెప్పారు. బాగా ఫేమస్‌, కెపాసిటీ ఉన్న కంటెస్టెంట్‌కు మాత్రం ఆ చాన్స్‌ ఇవ్వనని, ఎవరైతే కొంచెం వెనుకబడి ఉన్నారో వారికే ఇస్తానని చెప్పుకొచ్చారు. తన నిర్ణయం సరైనది కావచ్చు కాకపోవచ్చు అంటూ.. ఆ చాన్స్‌ను అమిత్‌కు ఇచ్చేశారు కమల్‌. దీంతో అమిత్‌ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ చాన్స్‌తో అమిత్‌ ఓ రెండు వారాలు సేఫ్‌ అయ్యాడు. ఇలా శుక్రవారం కార్యక్రమం కమల్‌ హాసన్‌ ఎంట్రీతో బిగ్‌బాస్‌ హౌజ్‌ అంతా కోలాహలంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement