
ఆ ట్రైలర్ లో భూమికను చూశారా?
ఖుషీ, ఒక్కడు, అనసూయ లాంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన భూమిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే.
ఖుషీ, ఒక్కడు, అనసూయ లాంటి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన భూమిక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె హిందీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుంది. రెండు రోజుల క్రితం రిలీజై ఇప్పటికే 40లక్షల మంది వీక్షకులను మెప్పించిన 'ఎమ్మెస్ ధోనీ' చిత్ర ట్రైలర్లో తళుక్కుమంది భూమిక.
సాధారణ రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి స్టార్ క్రికెటర్గా ఎదిగిన ధోనీ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని 'ఎమ్మెస్ ధోనీ' పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. యువనటుడు సుశాంత్ రాజ్పుత్ టైటిల్ రోల్ను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ధోనీ సోదరిగా భూమిక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఇక మీదట ఆమె క్యారెక్టర్ రోల్స్ కు ఓకే చెబుతారేమోననే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే.. తిరిగి భూమిక తెర మీద కనిపించాలని కోరుకునే ఫ్యాన్స్కు పండుగే.