ఇది మంచి పరిణామం | Balakrishna launches 'Mirchi Lanti Kurradu' audio | Sakshi
Sakshi News home page

ఇది మంచి పరిణామం

Nov 15 2014 1:10 AM | Updated on Aug 29 2018 7:42 PM

ఇది మంచి పరిణామం - Sakshi

ఇది మంచి పరిణామం

మంచి చిత్రాలు తీయాలనే సంకల్పంతో రుద్రపాటి రమణారావు ఈ సంస్థ స్థాపించారు. నాతో ఓ సినిమా తీస్తున్నారాయన.

 - బాలకృష్ణ
‘‘మంచి చిత్రాలు తీయాలనే సంకల్పంతో రుద్రపాటి రమణారావు ఈ సంస్థ స్థాపించారు. నాతో ఓ సినిమా తీస్తున్నారాయన. ఆ చిత్రవిశేషాలు ఇప్పుడు కాదు.. తర్వాత చెబుతా. ఈ చిత్రం పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. పాటలు హిట్టయితే సినిమా హిట్టయినట్లే లెక్క’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. అభిజిత్, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన చిత్రం ‘మిర్చి లాంటి కుర్రాడు’.

 జయనాగ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రానికి జేబీ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని బాలకృష్ణ ఆవిష్కరించి దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇది మంచి పరిణామం. ‘మిర్చి లాంటి కుర్రాడు’ని దర్శకుడు బాగా తెరకెక్కించి ఉంటారని, ఈ చిత్రం ద్వారా మంచి సందేశం ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను’’ అన్నారు.

ప్రచార చిత్రాలు చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయని బోయపాటి వ్యాఖ్యానించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘లవ్, కామెడీ, సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. వీరబాబు రాసిన సంభాషణలు, జేబీ పాటలు హైలైట్ అవుతాయని దర్శకుడు అన్నారు. అభిజిత్, జేబీ తదితరులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement