Mirchi Lanti Kurradu
-
ఘాటుగా...
ఆ కుర్రాడు చాలా యాక్టివ్. సరదా సరదాగా ఉంటాడు. కానీ, ఎవరైనా కానిపని చేశారో చెలరేగిపోతాడు. మిర్చిలోని ఘాటుతో ఈ కుర్రాడి దమ్మూ, ధైర్యాన్ని పోల్చవచ్చు. ఈ కుర్రాడి కథ ఏంటి? సరదాగా ఎంజాయ్ చేసే వయసులో మిర్చి స్థాయిలో ఎందుకు చెలరేగాల్సి వచ్చిందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మిర్చిలాంటి కుర్రాడు’. అభిజిత్, ప్రగ్యా జైస్వాల్ జంటగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మించిన చిత్రం ఇది. జయనాగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘జేబీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని పాటలకూ మంచి స్పందన లభిస్తోంది. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న యూత్ఫుల్ మూవీ ఇది. అభిజిత్, ప్రగ్యా జైస్వాల్ అద్భుతంగా నటించారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉండే ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
'మిర్చిలాంటి కుర్రాడు' స్టిల్స్
-
ఇది మంచి పరిణామం
- బాలకృష్ణ ‘‘మంచి చిత్రాలు తీయాలనే సంకల్పంతో రుద్రపాటి రమణారావు ఈ సంస్థ స్థాపించారు. నాతో ఓ సినిమా తీస్తున్నారాయన. ఆ చిత్రవిశేషాలు ఇప్పుడు కాదు.. తర్వాత చెబుతా. ఈ చిత్రం పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. పాటలు హిట్టయితే సినిమా హిట్టయినట్లే లెక్క’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. అభిజిత్, ప్రజ్ఞా జైస్వాల్ జంటగా రుద్రపాటి ప్రేమలత సమర్పణలో రుద్రపాటి రమణారావు నిర్మించిన చిత్రం ‘మిర్చి లాంటి కుర్రాడు’. జయనాగ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ రూపొందించిన ఈ చిత్రానికి జేబీ పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని బాలకృష్ణ ఆవిష్కరించి దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇది మంచి పరిణామం. ‘మిర్చి లాంటి కుర్రాడు’ని దర్శకుడు బాగా తెరకెక్కించి ఉంటారని, ఈ చిత్రం ద్వారా మంచి సందేశం ఇచ్చి ఉంటారని అనుకుంటున్నాను’’ అన్నారు. ప్రచార చిత్రాలు చాలా కలర్ఫుల్గా ఉన్నాయని బోయపాటి వ్యాఖ్యానించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘లవ్, కామెడీ, సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని తెలిపారు. వీరబాబు రాసిన సంభాషణలు, జేబీ పాటలు హైలైట్ అవుతాయని దర్శకుడు అన్నారు. అభిజిత్, జేబీ తదితరులు ప్రసంగించారు. -
'మిర్చిలాంటి కుర్రాడు' ఆడియో ఆవిష్కరణ
-
మిర్చిలాంటి కుర్రాడు మూవీ స్టిల్స్
-
'మిర్చిలాంటి కుర్రాడు' ట్రైలర్ లాంఛ్
-
ఘాటైన కుర్రాడి కథ!
‘‘నేటి కుర్రాళ్లు మిర్చిలా ఘాటుగా ఉంటున్నారు. అలాంటి ఓ కుర్రాడి కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం మా ‘మిర్చిలాంటి కుర్రాడు’. ప్రేమకథను ఇలానూ తీయొచ్చా అనిపించేలా ఈ సినిమా ఉంటుంది’’ అంటున్నారు దర్శకుడు జయనాగ్. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్, ప్రగ్య, జైశ్వాల్ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రం రూపొందుతోంది. జయనాగ్ని దర్శకునిగా పరిచయం చేస్తూ రుద్రపాటి రమణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లో సాగర్, టి. ప్రసన్నకుమార్ల చేతుల మీదుగా ఈ చిత్రం ప్రచార చిత్రాలను విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘భావోద్వేగాలతో కూడిన వినోదాత్మక ప్రేమకథ ఇది. నిర్మాణం విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. పది రోజుల్లో పాటలను, ఈ నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. టైటిల్ చూసి ఇదేదో మాస్ సినిమా అనుకోవద్దని, కథకు అవసరమైన మేరకే యాక్షన్ సన్నివేశాలుంటాయని అభిజిత్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: వీరబాబు, కెమెరా: ఆర్.ఎం.స్వామి, సంగీతం: జేబీ, కూర్పు: ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రాజు. -
టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ తో మరో హీరో!
ప్రభాస్, అల్లు అర్జున్, నితిన్, మంచు మనోజ్ లు సిక్స్ ప్యాక్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆలరించారు. టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ తో మరో హీరో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో టాలీవుడ్ కు పరిచమైన అభిజిత్ తాజాగా 'మిర్చిలాంటి కుర్రోడు' చిత్రంలో నటిస్తున్నారు. మిర్చిలాంటి కుర్రోడు చిత్రంలో సిక్స్ ప్యాక్ తో అభిజిత్ సెన్సెషన్ క్రియేట్ చేశాడు. మిర్చిలాంటి కుర్రోడు చిత్ర విజయంపై అభిజిత్ విశ్వాసంతో ఉన్నారు. అభిజిత్ సిక్స్ ప్యాక్ కు టాలీవుడ్ లో మంచి స్పందన లభించింది. సిక్స్ ప్యాక్ తో అభిజిత్ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాడు. త్వరలోనే 'మిర్చిలాంటి కుర్రాడు' చిత్రం విడుదల కానుంది. -
మిర్చి లాంటి కుర్రాడి ప్రేమ
దమ్మున్న కుర్రాడి కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిర్చి లాంటి కుర్రాడు’. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్ ఇందులో కథానాయికుడు. ప్రాజీ జైస్వాల్ కథానాయిక. నాగేశ్వరరావు దర్శకుడు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘వినోదం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపు ఈ సినిమా. ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. అభిజిత్ నటన, వీరబాబు మాటలు, జేబీ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు’’ అని తెలిపారు. ‘‘టైటిల్కి తగ్గట్టు వాణిజ్య అంశాల కలగలుపుగా ఈ చిత్రం ఉంటుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మే నెల ప్రథమార్ధంలో పాటలను, అదే నెల చివర్లో కానీ, జూన్ తొలివారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. కథను నమ్మి తాను ఈ చిత్రం చేస్తున్నానని అభిజిత్ అన్నారు. సప్తగిరి, షకలక శంకర్, రమేశ్, శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. -
మిర్చి లాంటి కుర్రాడు