మిర్చి లాంటి కుర్రాడి ప్రేమ | Life Is Beautiful Abhijit in Mirchi Lanti Kurradu | Sakshi
Sakshi News home page

మిర్చి లాంటి కుర్రాడి ప్రేమ

Published Mon, Apr 14 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

మిర్చి లాంటి కుర్రాడి ప్రేమ

 దమ్మున్న కుర్రాడి కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘మిర్చి లాంటి కుర్రాడు’. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేం అభిజిత్ ఇందులో కథానాయికుడు. ప్రాజీ జైస్వాల్ కథానాయిక. నాగేశ్వరరావు దర్శకుడు. రుద్రపాటి రమణారావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ -‘‘వినోదం, ప్రేమ, భావోద్వేగాల మేళవింపు ఈ సినిమా. ఆద్యంతం ఆసక్తికరంగా సినిమా సాగుతుంది. అభిజిత్ నటన, వీరబాబు మాటలు, జేబీ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలు’’ అని తెలిపారు. ‘‘టైటిల్‌కి తగ్గట్టు వాణిజ్య అంశాల కలగలుపుగా ఈ చిత్రం ఉంటుంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మే నెల ప్రథమార్ధంలో పాటలను, అదే నెల చివర్లో కానీ, జూన్ తొలివారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని నిర్మాత చెప్పారు. కథను నమ్మి తాను ఈ చిత్రం చేస్తున్నానని అభిజిత్ అన్నారు. సప్తగిరి, షకలక శంకర్, రమేశ్, శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement