బాహుబలి డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? | bahubali dialogue writer ratna babu interview | Sakshi
Sakshi News home page

బాహుబలి డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా?

Sep 19 2016 12:09 AM | Updated on Aug 20 2018 6:18 PM

బాహుబలి డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా? - Sakshi

బాహుబలి డైలాగ్ రైటర్ ఎవరో తెలుసా?

సిన్మాకి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ దర్శకుడే. మరి, ఆ షిప్‌కి కథ, కథనం, మాటలు అందిస్తున్న దిక్సూచి లాంటి రైటర్ సంగతేంటి?

 ‘‘సిన్మాకి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ దర్శకుడే. మరి, ఆ షిప్‌కి కథ, కథనం, మాటలు అందిస్తున్న దిక్సూచి లాంటి రైటర్ సంగతేంటి? సక్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ దర్శకుడికే దక్కుతోంది. రైటర్స్‌కి విలువ తగ్గుతోంది’’ అన్నారు ‘డైమండ్’ రత్నబాబు. ‘భాయ్’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సీమ శాస్త్రి’, ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాలకు మాటలు రాశారీయన. ఈ దసరాకి రిలీజ్ కానున్న ‘అల్లరి’ నరేశ్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’కి ఈయనే డైలాగ్ రైటర్. ‘డైమండ్’ రత్నబాబు చెప్పిన సంగతులు...
 
  రిజల్ట్ పక్కన పెడితే ‘భాయ్’ మంచి పేరు తీసుకొచ్చింది. భాయ్ బుల్లెట్స్ పేరుతో ఆ సినిమా డైలాగ్స్ రిలీజ్ చేశారు. ‘సీమశాస్త్రి’తో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డిగారితో జర్నీ స్టార్టైంది. ఆ తర్వాత ‘ఈడోరకం ఆడోరకం’, ఇప్పుడీ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’.. హ్యాట్రిక్ కొడతామని ధీమాగా చెప్పగలను.
 
  ఇండస్ట్రీలో నేను సంపాదించిన ఆస్తి ఏదైనా ఉందంటే.. అది మంచు ఫ్యామిలీ అభిమానమే. మోహన్‌బాబుగారు నా గాడ్‌ఫాదర్. మంచు విష్ణు ఎంకరేజ్‌మెంట్ మరువలేనిది. ‘లక్కున్నోడు’కి స్క్రీన్‌ప్లే, మాటలు రాస్తున్నాను. నేడు నా పుట్టినరోజు వేడుకలను ఆ సినిమా షూటింగ్‌లో జరుపుకోబోతున్నా.
 
 ‘బాహుబలి’ దర్శకుడు ఎవరంటే ప్రేక్షకులు ఠక్కున చెబుతారు. ఆ సినిమా డైలాగ్ రైటర్ ఎంతమందికి తెలుసు? రైటర్‌కి రావల్సిన గుర్తింపు, పేరు రావడం లేదు. నేను చెప్పేదొక్కటే ‘సేవ్ రైటర్స్-సేవ్ సినిమా’. త్వరలో దర్శకుడిగా మారుతున్నా. దర్శకుడైన తర్వాత కూడా డైలాగ్ రైటర్‌గా కొనసాగుతా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement