
రాజమౌళికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: రకుల్
తెలుగు సెల్యూలాయిడ్‌కు సరికొత్త గ్లామర్ కిక్ రకుల్ ప్రీత్‌సింగ్.
తెలుగు సెల్యూలాయిడ్‌కు సరికొత్త గ్లామర్ కిక్ రకుల్ ప్రీత్‌సింగ్. కరెంట్ తీగలా కనిపించే ఈ ఢిల్లీ జవ్వని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతూ, అందరు హీరోలకూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంటున్నారు. ఏమాత్రం రఫ్‌నెస్ లేకుండా లౌక్యంగా మాట్లాడే రకుల్ తను ఆదివారం బాహుబలి సినిమా చూసిందట.. ఈ సినిమా చూడటం ఇప్పటికే ఆలస్యం అయిందని కానీ చివరికి చూశానని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
బాహుబలి సినిమా తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందన్నారు... ప్రభాస్, తమన్నా, రాణా, రమ్య కృష్ణల నటన అద్భుతం అంటూ కితాబిచ్చారు.
'ఇంత గొప్పసినిమా తీయగలిగిన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేనూ ఒక భాగం అయినందుకు గర్వంగా ఉందన్నారు..మహాద్భుతంగా చిత్రాన్ని తీసిన రాజమౌళికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు...
#Baahubali has taken Telugu cinema to an international level!Amazing performances by all @tamannaahspeaks #prabhas @RanaDaggubati #ramya mam
— Rakul Preet (@Rakulpreet) August 2, 2015
Late but finally saw #Baahuabli !! So proud to b a part of an industry that made such a film. Grand at a diff level.Take a bow @ssrajamouli
— Rakul Preet (@Rakulpreet) August 2, 2015