హిందీ నుంచి తెలుగులోకి... | B.A Pass movie remake in telugu | Sakshi
Sakshi News home page

హిందీ నుంచి తెలుగులోకి...

Dec 25 2014 11:45 PM | Updated on Sep 2 2017 6:44 PM

హిందీ నుంచి తెలుగులోకి...

హిందీ నుంచి తెలుగులోకి...

శిల్ప శుక్లా, షాదాబ్ కమల్, దివ్యేంద్ర భట్టాచార్య, రాజేశ్ శర్మ ప్రధాన పాత్రధారులుగా... అజయ్ చెహల్ దర్శకత్వంలో హిందీలో రూపొందిన

శిల్ప శుక్లా, షాదాబ్ కమల్, దివ్యేంద్ర భట్టాచార్య, రాజేశ్ శర్మ ప్రధాన పాత్రధారులుగా... అజయ్ చెహల్ దర్శకత్వంలో హిందీలో రూపొందిన సినిమా ‘బి.ఏ. పాస్’. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు ఎం. అచ్చిబాబు. హైదరాబాద్‌లో అనువాద కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ నటుడు చలపతిరావు, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్.. నిర్మాతకు అభినందనలందించారు. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వీఎస్‌పీ తెన్నేటి, సంగీతం: అలోక్‌నంద్‌దాస్ గుప్తా, నిర్వహణ: డి.నారాయణ, సమర్పణ: సంపత్‌కుమార్.
 

Advertisement
 
Advertisement
Advertisement