అవెంజర్స్‌తో ఆటలు ; చితకొట్టిన అభిమానులు..!

Avengers Endgame Fans Beaten A Spoiler In China - Sakshi

హాంకాంగ్‌ : అభిమానులందు అవెంజర్స్‌ అభిమానులు వేరయా అన్నట్టు ప్రవర్తించారు చైనాలో. మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్‌ హీరో సీరిస్‌లో చివరి సినిమా అవడంతో అవెంజర్స్‌ ; ఎండ్‌గేమ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. సూపర్‌ హీరో సీరిస్‌ను ఎలా ముగించారో అని సినీ ప్రియులు.. ముఖ్యంగా అవెంజర్స్‌ అభిమానులు ఉత్సాహంగా సినిమా చూసేందుకు రెడీ అవుతున్నారు. అదేసందర్భంలో ఈ సినిమా కథ గురించి ముందే చెప్పి తమ ఎగ్జయిటింగ్‌కు గండికొట్టద్దని వేడుకుంటున్నారు. మాట వినకపోతే తాట తీస్తున్నారు.

సినిమా దర్శకులు రూసో బ్రదర్స్‌ సైతం ‘అవెంజర్స్‌ ; ఎండ్‌గేమ్‌ కథను ఎక్కడా రివీల్‌ చేయకండి. థియేటర్లలో గొప్ప అనుభూతి’ పొందండి అని ట్విటర్‌లో సూచించారు కూడా. అయితే, ఈ సినిమా విశేషాలు చెప్తానంటూ సినిమా థియేటర్‌ దగ్గర రచ్చ చేసిన ఓ ఆకతాయిని అభిమానులు చితకొట్టారు. ఈ ఘటన చైనాలోని కాజ్వే బేలో బుధవారం జరిగింది. మరి కష్టపడి, క్యూలైన్లలో గంటల కొద్దీ నిలబడి టికెట్లు సంపాదించుకున్న అభిమానులు తమ ఆనందాన్ని ఆవిరి చేస్తామంటే ఊరుకుంటారా ఏంటి..!

చైనాతో పాటు పలు ఆసియా దేశాల్లో బుధవారం విడుదలైన అవెంజర్స్‌ ; ఎండ్‌గేమ్‌.. భారత్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్‌ చూస్తుంటే తొలి వారాంతానికి రూ.6000 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గత చిత్రాల రికార్డులన్ని చేరిపేసి 20 వేల కోట్ల వసూళ్లతో ఆల్‌టైం రికార్డ్‌ సెట్ చేయటం ఖాయం అంటున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top