అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐ..ఎస్పీకి అటాచ్మెంట్ | Attachment issued to SI misbehaving with Cinema unit | Sakshi
Sakshi News home page

అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐ..ఎస్పీకి అటాచ్మెంట్

Feb 16 2015 8:32 AM | Updated on Sep 2 2018 5:06 PM

అసభ్యకరంగా ప్రవర్తించిన ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్ఐ షణ్ముఖాచారిని జిల్లా ఎస్పీకి అటాచ్మెంట్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఖమ్మం : 'ఆంధ్రాపోరి' సినీ యూనిట్తో అసభ్యకరంగా ప్రవర్తించిన ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్ఐ షణ్ముఖాచారిని జిల్లా ఎస్పీకి అటాచ్మెంట్ చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత 20 రోజులుగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా 'ఆంధ్రాపోరి' సినిమా పాల్వంచలో షూటింగ్ చేస్తున్నారు.

భద్రాచలం రోడ్లోని బృందావన్ రెస్టారెంట్లో చిత్ర యూనిట్ బస చేసింది. అయిదు రోజుల క్రితం రాత్రివేళ ఎస్ఐ ఆ రెస్టారెంట్కు వెళ్లి చిత్ర బృందంతో అసభ్యకరంగా ప్రవర్తించారు. పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్ఐని ఎస్పీకి అటాచ్ చేసి ...సంఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement