నేను ఉమ్మేస్తే స్టారే! | As a kid, Aamir Khan would lie to his father about shooting movies | Sakshi
Sakshi News home page

నేను ఉమ్మేస్తే స్టారే!

Oct 23 2016 11:19 PM | Updated on Apr 3 2019 6:23 PM

నేను ఉమ్మేస్తే స్టారే! - Sakshi

నేను ఉమ్మేస్తే స్టారే!

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ లాలాజలానికి గిరాకీ పెరుగుతోంది. ఎందుకంటే

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ లాలాజలానికి గిరాకీ పెరుగుతోంది. ఎందుకంటే... ఆయన ఉమ్ములో అదృష్ట దేవత ఉందట. మాధురీ దీక్షిత్‌తో సహా పలువురు హీరోయిన్లు ఆమిర్ ఉమ్మడంతోనే నంబర్ వన్ స్టార్స్ అయ్యారట! ఇంతకీ ఈ ఉమ్ము కహానీ ఏంటంటే.. ప్రాక్టికల్ జోక్స్ వేయడంలో ఆమిర్ స్పెషలిస్ట్. ‘‘ఏది నీ చెయ్యి చూపించు. జాతకం చెబుతా’ అనడిగి.. ఆ హీరోయిన్ చేతిలో ‘తూ..’ అని ఉమ్మేయడం ఆమిర్ అలవాటు’’ అని మామి (ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్) ఫెస్టివల్‌లో ప్రముఖ హిందీ కొరియోగ్రాఫర్ కమ్ దర్శకురాలు ఫరాఖాన్ చెప్పారు. ‘జో జీతా వహీ సికందర్’ సినిమా టైమ్‌లో సంగతులను గుర్తు చేసుకున్నారామె.

‘‘ఆమిర్ చేసిన పనికి మాధురీ దీక్షిత్‌కి కోపం రావడంతో హాకీ స్టిక్ పట్టుకుని వెంటపడింది. ఎక్కడ కొడుతుందోనని ఆమిర్ పరుగులు తీశాడు’’ అని ఫరా చెప్పారు. పక్కనున్న ఆమిర్ ‘‘ఏయే హీరోయిన్ల చేతులపై ఉమ్మేశానో.. వాళ్లందరూ నంబర్ వన్ స్టార్స్ అయ్యారు’’ అన్నారు. అక్కడే  ఉన్న పూజా బేడి... ‘‘వెంటనే నా కూతురు ఆలియాకు ఆమిర్‌ను కలవమని చెబుతా. ‘ఆమిర్ అంకుల్‌కి చెయ్యి చూపించు’ అని చెప్తా’’ అని జోక్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement