జయంరవి-హన్సిక మధ్యలో ఆర్య | Arya Guest Role In Romeo Juliet | Sakshi
Sakshi News home page

జయంరవి-హన్సిక మధ్యలో ఆర్య

Sep 23 2014 12:11 AM | Updated on Sep 2 2017 1:48 PM

జయంరవి-హన్సిక మధ్యలో ఆర్య

జయంరవి-హన్సిక మధ్యలో ఆర్య

జయం రవి-హన్సిక మధ్యలో ఆర్య. ఈ పేరుతో సినిమా రూపొందితే కలెక్షన్ల వర్షం కురుస్తుంది కదూ? అలాకాకుండా ఈ ముగ్గురూ కలిసి నటిస్తే ఇంకా క్రేజ్ అంటారా? ఈ క్రేజీ కలయికలో చిత్రం

 జయం రవి-హన్సిక మధ్యలో ఆర్య. ఈ పేరుతో సినిమా రూపొందితే కలెక్షన్ల వర్షం కురుస్తుంది కదూ? అలాకాకుండా ఈ ముగ్గురూ కలిసి నటిస్తే ఇంకా క్రేజ్ అంటారా? ఈ క్రేజీ కలయికలో చిత్రం తెరకెక్కుతున్న విషయం నిజమే. అయితే ఇందులో ఆర్య అతిథేనట. ఇంతకీ విషయం ఏమిటంటే ఇంతకు ముందు నయనతార, అనుష్కతో యమా క్లోజ్‌గా మెలిగిన నటుడు ఆర్య ఇప్పుడు హన్సిక సన్నిహితుడయ్యారట. వీరిద్దరూ కలిసి ఇంతకు ముందు సేట్టై చిత్రంలో జతకట్టారు. తాజాగా మెగామాన్ చిత్రంలో రొమాన్స్ చేస్తున్నారు.
 
 ఇందులో ఒక పాటకు హన్సిక ఆర్యతో హద్దులు మీరి నటించేసి ఆ తరువాత శృంగారం మితిమీరిందేమో అంటూ చింతించిందట. ఈ కథ అటుంచితే ప్రస్తుతం ఈ బ్యూటీ జయం రవితో రోమియో జూలియట్ చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ రోమియో జూలియట్ మధ్యకు ఆర్య అతిథిగా వచ్చిపడ్డారట. చిత్రంలో జయం రవి హీరో అయినా హన్సిక ఆర్యతోనే క్లోజ్‌గా ఉండడంతో యూనిట్ చెవులు కొరుక్కుంటోంది. రోమియో జూలియట్ చిత్రంలో ఆర్యకు హన్సికకు రొమాన్స్ సన్నివేశాలున్నాయా అన్న ప్రశ్నకు చిత్ర యూనిట్ ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. ఏదేమయినా జయం రవి, హన్సికల మధ్యకు ఆర్య రావడం రోమియో జూలియెట్‌కు బోలెడంత ప్రచారం ఫ్రీగా వచ్చేస్తోందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement