అర్జున్ రెడ్డికి కొత్త కష్టాలు..! | Arjun Reddy satellite Rights troubles | Sakshi
Sakshi News home page

అర్జున్ రెడ్డికి కొత్త కష్టాలు..!

Sep 5 2017 10:43 AM | Updated on Sep 17 2017 6:26 PM

అర్జున్ రెడ్డికి కొత్త కష్టాలు..!

అర్జున్ రెడ్డికి కొత్త కష్టాలు..!

ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. వివాదాలతోనే భారీ హైప్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి

ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైన తెలుగు సినిమా అర్జున్ రెడ్డి. వివాదాలతోనే భారీ హైప్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి అదే స్థాయిలో కలెక్షన్లు కూడా సాధిస్తోంది. బోల్డ్ కంటెంట్ తో యూత్ ఆకట్టుకున్న అర్జున్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ కు తెర తీసింది. అయితే ఇంతటి ఘనవిజయాన్ని సాధించిన ఈసినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం ఇంతవరకు అమ్ముడవ్వలేదు. సాధారణంగా భారీ హైప్ క్రియేట్ చేసిన సినిమాల రైట్స్ రిలీజ్ కు ముందే అమ్ముడవుతాయి.

అయితే అర్జున్ రెడ్డి సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కటంతో ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు డైలాగులు ఉన్నాయి. వీటి కారణంగా సినిమాకు ఇంతటి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఏ సర్టిఫికేట్ సినిమాలు టీవీలో ప్రదర్శించేందుకు అనుమతించరు.. ఆ సినిమాలను తిరిగి సెన్సార్ చేయించి అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి యు/ఎ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. అయితే అర్జున్ రెడ్డి సినిమాలో ఆ సీన్స్ తొలగిస్తే సినిమాకు బుల్లితెర మీద ఆదరణ ఎలా ఉంటుందో అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే ఇప్పటికే భారీ లాభాలు సాధించిన అర్జున్ రెడ్డి యూనిట్ శాటిలైట్ రైట్స్ విషయంలో ఏం చేస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement