‘అరవింద’ కు అదనపు షోల అనుమతి

Ap Government Granted Permission For Extra Shows for Aravinda Sametha - Sakshi

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం అరవింద సమేత. దసరా సెలవుల్లో రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రానికి ఏపీ ప్రభుత్వం అదనపు షోలకు సంబంధించిన అనుమతిని ఇచ్చింది. ఇక సినిమా రిలీజైన తరువాత వారం రోజుల పాటు (అక్టోబర్‌ 11 నుండి 18వరకు) రోజుకు ఆరు షోలను ప్రదర్శించుకునే అవకాశాన్ని కలిపించింది. పండగ సీజన్‌ కావడం, ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌పై ఉండే క్రేజ్‌.. వీటన్నంటిని దృష్ట్యా ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులను క్రియేట్‌ చేస్తుందని ట్రేడ్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలె ఈ మూవీ సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్‌ను పొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top