ఇది భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి

Anushka Shetty's Bhaagamathie Trailer Trends. It's Scary As Heck - Sakshi

‘ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా..  భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వను’ అంటూ అనుష్క చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో రిలీజైంది ‘భాగమతి’ట్రైలర్‌. అనుష్క టైటిల్‌ రోల్‌లో ‘పిల్ల జమీందార్‌’ ఫేమ్‌ జి.అశోక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ–ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం ‘భాగమతి’ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘బాహుబలి’ సినిమాతో సూపర్‌ ఫామ్‌లో ఉన్న అనుష్కతో ‘భాగమతి’ చిత్రం నిర్మించినందుకు గర్వంగా ఉంది. అనుష్క నటన ఈ సినిమాకు హైలైట్‌. ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తోంది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అద్భుతమైన కథని అంతే అద్భుతంగా అశోక్‌ తెరకెక్కించారు. ‘భాగమతి’ కథ, కథనం తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. కథకు తగ్గట్టుగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. తమన్‌ పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్‌’’ అన్నారు. ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్, మురళీ శర్మ, ధన్‌రాజ్, ప్రభాస్‌ శ్రీను, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు నటించిన ఈ సినిమాకి కెమెరా: మథి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top