
టీ.నగర్: ఒక చిత్రంలో నటిస్తూ వచ్చిన అనుపమ హఠాత్తుగా స్పృహ తప్పడం సంచలనం కలిగించింది. ధనుష్‌కు జంటగా ‘కొడి’ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ నటించారు. ప్రస్తుతం మళయాల, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. గురువారం ఆమె ఒక తెలుగు చిత్రంలో ప్రకాష్‌రాజ్‌తో నటిస్తూ వచ్చారు. ఒక టెన్షన్ సీన్‌లో నటిస్తుండడంతో భావోద్వేగానికి గురైన అనుపమ స్పృహతప్పి కిందపడ్డారు.
వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం ఆమె కోలుకున్నారు. దీనిగురించి అనుపమ తన ఫేస్‌బుక్‌లో ఈ విధంగా పోస్ట్ చేశారు. ప్రకాష్‌రాజ్‌తో నటిస్తుండగా డైలాగ్‌ను పూర్తిగా చెప్పలేక తటపాయించానని, వెంటనే ఆయన మళ్లీ డైలాగ్ చదివి నటించాలని తెలిపారన్నారు. ఇదివరకే తనకు చలిజ్వరంతో బాధపడ్డానని, లో బీపీతో బాధపడినట్లు తెలిపారు. దీంతో స్పృహతప్పడం జరిగిందని, ప్రస్తుతం కోలుకున్నట్లు తెలిపారు.