
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అనుపమ పరమేశ్వరన్
శతమానం భవతి..ప్రేమమ్.. రాక్షసుడు తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన అందాల నటి అనుపమ ఆదివారం నంద్యాలలో సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటి అనుపమను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
సాక్షి, నంద్యాల(కర్నూలు): పట్టణంలోని శ్రీనివాస నగర్– సంజీవగేట్ మధ్యలో ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ 65వ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. ఈ సందర్భంగా భారీగా తరలివచ్చిన యువకులను అనుపమ తన హావభావాలతో ఉత్సాహపరిచారు. అనంతరం ఆమెతోపాటు ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. చందన బ్రదర్స్ షోరూం ప్రారంభం సందర్భంగా నంద్యాలకు వచ్చి తన అభిమానులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అనుపమ అన్నారు. పట్టు వస్త్రాలు, చీరలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి దసరా పండుగను ఆనందంగా నిర్వహించుకోవాలని కోరారు.