హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ | Anshula Kapoor Posts Screenshot Of WhatsApp Chat With Her Family | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ నటుడితో పోటీపడుతున్న కఫూర్‌ ఫ్యామిలీ

Nov 8 2019 2:52 PM | Updated on Nov 8 2019 3:06 PM

Anshula Kapoor Posts Screenshot Of WhatsApp Chat With Her Family - Sakshi

ఢిల్లీ : బోనీ కపూర్‌ ఫ్యామిలీ హాలీవుడ్‌ నటుడు జార్జ్‌ క్లూనీ పాత్రకు గట్టి పోటీ ఇస్తున్నారట !  అదేంటి.. కపూర్‌ ఫ్యామిలీ హాలీవుడ్‌ సినిమాలో నటించడంమేంటని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్తను మొత్తం చదివితే విషయం మీకే అర్థమవుతుంది. జార్జ్‌ క్లూనీ 2009లో తాను నటించిన 'అప్‌ ఇన్‌ది ఎయిర్‌' సినిమాలో చివరి వరకు తన ఇంట్లో కన్నా విమాన ప్రయాణాల్లోనే ఎక్కువగా కనిపిస్తాడు. అదే సంఘటన గురువారం కపూర్‌ ఫ్యామిలీలోనూ చోటుచేసుకుంది.

గురువారం కపూర్‌ ఫ్యామిలీ ఎవరి పనుల్లో  వాళ్లు నిమగ్నమవుతూ విమానంలో ప్రయాణం చేశారు. ఇదే విషయాన్ని తాజాగా అన్షులాకపూర్‌ వారి కుటుంబసభ్యులు వాట్సప్‌ గ్రూప్‌లో చేసిన చాట్‌ను స్క్రీన్‌షాట్‌ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ పోస్ట్‌లో తన ఫ్యామిలీ వాట్సప్‌ గ్రూప్‌లో ఎవరు ఎక్కడ ఉన్నారని చేసిన సంభాషణను పంచుకున్నారు. ప్రస్తుతం దోస్తానా 2 షూటింగ్‌లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్‌ తన తండ్రి బోనీ కపూర్‌, సోదరుడు అర్జున్‌ కపూర్‌లకు తాను అమృత్‌సర్‌లో సేఫ్‌గా ల్యాండ్‌ అయినట్లు మెసేజ్‌ చేశారు. అదే విధంగా అన్షులా కపూర్‌ కూడా ' నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరాను' అంటూ మెసేజ్‌ పెట్టారు. ఇదంతా గమనించిన బోనీ కపూర్‌ తాను కూడా ఇప్పుడే చెన్నెనుంచి ముంబయికి బయలుదేరడానికి ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో వెయిట్‌ చేస్తున్నట్లు చెప్పాడు.

దీంతో అన్షులా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ' ఓ మైగాడ్‌ ! ఏంటో ఈరోజు అందరం విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నామా' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. వీరి సంభాషణను స్ర్కీన్‌ షాట్‌ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'మాకు డాడ్‌ కిడ్స్‌ అనే పేరుతో వాట్సప్‌ గ్రూఫ్‌ ఒకటి ఉంది. ఆ గ్రూపులో నాతో పాటు అన్షులా, అర్జున్‌ కపూర్‌, ఖుషీ కపూర్‌, మా నాన్న సభ్యులుగా ఉన్నాము. మేము ప్రతీ విషయాన్ని ఒక మొమొరీగా గుర్తుంచుకునేందుకు ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసుకుంటామని' మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్వీ కపూర్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement