
రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తాజాగా మరో కేసు నమోదైంది.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తాజాగా మరో కేసు నమోదైంది. వినాయకుడిపై వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేసినందుకు ఇంతకుముందే ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కూడా వర్మ మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్లో కూడా ఆయన మీద కేసు నమోదైంది.
రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వినాయకునిపై చేసిన వ్యాఖ్యలపై ఇంతకుముందు కొంతమంది వేర్వేరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.