ఐ యామ్‌ సారీ!

Amy Jackson's visa issues, delays shoot of 'The Villain'  - Sakshi

... అని చెప్పారట హీరోయిన్‌ అమీ జాక్సన్‌. ఎందుకు చెప్పాల్సి వచ్చిందనేగా మీ డౌట్‌. అక్కడికే వస్తున్నాం. శివరాజ్‌ కుమార్, సుదీప్, అమీ జాక్సన్‌ కీలకపాత్రల్లో  ‘ది విలన్‌’ అనే కన్నడ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు కిరణ్‌కుమార్‌ (స్క్రీన్‌ నేమ్‌ ప్రేమ్‌). ఈ ఏడాది జూలైలో ఈ సినిమా షూట్‌ను స్టార్ట్‌ చేశారు. ఆ షూట్‌లో అమీ జాక్సన్‌ కూడా పాల్గొన్నారు. అయితే ఈ నెలలో మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారట డైరెక్టర్‌ ప్రేమ్‌.

ఆ షెడ్యూల్‌ షూట్‌ స్టార్ట్‌ కాకపోయే సరికి ఇండస్ట్రీలో ఈ సినిమాపై రూమర్లు వచ్చాయి. వీటిపై దర్శకుడు స్పందిచారు. ‘‘సినిమా లేట్‌ అవ్వడంలో నా ప్రమేయం ఏమీ లేదు. అమీ జాక్సన్‌ వీసా పాబ్లమ్స్‌ వల్ల ఫిక్స్‌ చేసిన షెడ్యూల్‌ టైమ్‌కి రాలేనని చెప్పారు. ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయిన వెంటనే షూట్‌లో జాయిన్‌ అవుతానన్నారు. రాలేకపోయినందుకు ఆమె సారీ కూడా చెప్పారు. అలాగే హీరోలు శివరాజ్‌ కుమార్, సుదీప్‌లు బాగా సహకరిస్తున్నారు. షూటింగ్‌ను డిసెంబర్‌ కల్లా కంప్లీట్‌ చేద్దాం అనుకున్నాం. కానీ, ఇప్పుడు జనవరి ఎండింగ్‌ కల్లా కంప్లీట్‌ చేస్తాం’’ అని పేర్కొన్నారు ప్రేమ్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top