ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

Amrita Rao Reveals That Her Twitter Account Hacked - Sakshi

ముంబై : బాలీవుడ్‌ సెలబ్రిటీలు పలువురు సైబర్‌ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచన్‌, షాహిద్‌ కపూర్‌, అద్నాన్‌ సమీల తర్వాత తాజాగా నటి అమృతా రావు తన ట్విటర్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని వెల్లడించారు. ప్రముఖ మీడియా సంస్ధ నుంచి వచ్చిన లింక్‌ ద్వారా ట్విటర్‌ ఖాతా హ్యాకైందని ఆమె పేర్కొన్నారు.

వారం రోజుల కిందట తన ట్విటర్‌ అకౌంట్‌ హ్యాకైందని చెబుతూ ఇటీవల తనకు ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి మెసేజ్‌ వచ్చిందని, తన ఇంటర్వ్యూ కోసం అనుమతి కోరుతూ వచ్చిన ఆ మెయిల్‌ను తన సోషల్‌ మీడియా టీమ్‌ క్లిక్‌ చేయగానే ట్విటర్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని అమృతా రావు చెప్పారు.

దీంతో తనకు వెంటనే గతంలో అమితాబ్‌ బచన్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయిన ఉదంతం గుర్తుకువచ్చిందని, పరిశ్రమకు ఇది ఒక ప్రమాదకర ధోరణిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తనకు తుషార్‌ కపూర్‌ ట్విటర్‌ ఖాతా నుంచి మెసేజ్‌ రాగా, ఆయన తన అకౌంట్‌ హ్యాక్‌ అయిందని చెప్పారని అమృత గుర్తుచేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top